У вашего броузера проблема в совместимости с HTML5
ఎవరితో ఏవిధంగా ప్రవర్తించాలి?
వేటికొరకు వెంపర్లాడుతున్నామో వాటియొక్క అసలు సారము దుఃఖమే. కనుక వాటిపట్ల వైరాగ్యం కలిగి ఉండాలి.
సర్వతో మనసోఽసఙ్గమాదౌ సఙ్గం చ సాధుషు।
దయాం మైత్రీం ప్రశ్రయం చ భూతేష్వద్ధా యథోచితమ్!!
‘కైవల్యమనికేతతామ్’ – ఏకాంత స్వభావం అలవాటు చేసుకోవాలి. పదిమందితో తాను తిరుగుతున్నా తనకు తాను ఏకాంత భావన కలిగి ఉండడం సాధన చేసుకోవాలి.
‘శ్రద్ధాం భాగవతే శాస్త్రేఽనిన్దామన్యత్ర చాపి హి। - భాగవత సాధన చేసేవారు భక్తి ధర్మాన్ని ప్రబోధం చేసే శాస్త్రాలే అధ్యయనం చేయాలి. అవి అధ్యయనం చేస్తున్న సమయంలో ఇతర శాస్త్రాలను నిందించరాదు. ప్రతి శాస్త్రమో ఎవరికో ఒకరికి మేలు కలిగించడానికే ఏర్పడింది అని తెలుసుకోగలగాలి.
‘మనోవాక్కర్మదణ్డం చ సత్యం శమదమావపి’ – వాక్కును, కర్మను నిగ్రహించుకుంటూ సత్యము, శమము, దమము పాటించాలి.