Farmer Training on Natural Farming - Bopaya, Vegetable Cultivation || Rythunestham Foundation
У вашего броузера проблема в совместимости с HTML5
#Rythunestham #NaturalFarming
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 డిసెంబర్ 2 ఆదివారం ప్రకృతి వ్యవసాయ విధానంలో బొప్పాయి, కూరగాయల సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శరత్ బాబు, గుంటూరు జిల్లా రైతు మీసాల రామకృష్ణ పాల్గొని ప్రకృతి వ్యవసాయ విధానంలో బొప్పాయి, కూరగాయల సాగుపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించటం జరుగుతుంది. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి.
ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 97053 83666, 96767 97777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.