తెలుగు ఎన్నారైల పిల్లలని ‘తెలుగు నేర్చుకుందాం రండి’ అంటోందీ పాట!
У вашего броузера проблема в совместимости с HTML5
విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారి పిల్లల్లో చాలమందికి తెలుగు రాదు. తమ పిల్లలకి తెలుగు నేర్పించాలని తల్లిదండ్రులకు ఉన్నా అందుకు తగిన అవకాశాలు లేవనే చెప్పాలి. అమెరికాలో ఈమధ్య తెలుగు బడులు మొదలైనా ఆస్ట్రేలియా, ఐరోపాదేశాల్లో దాదాపు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిడ్నిలో స్థిరపడిన శ్రీ రాచకొండ మల్లికార్జునరావు అక్కడి తెలుగువారి పిల్లలకు తెలుగుభాష నేర్పించాలన్న కృతనిశ్చయంతో let’slearntelugu.com.au అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఇంగ్లీషు వచ్చిన తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకుందుకు ‘అక్షర పరిచయం’ అనే పేరుతో రెండు భాగాలుగా పుస్తకాలు ప్రచురించారు. ఈ పుస్తకాలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఐరోపా దేశాల్లో ఆదరణ పొందుతున్నాయి. తెలుగుభాషా వ్యాప్తికి తను చేసే కృషిలో భాగంగా ఈ ‘రారండోయ్ రారండోయ్ ‘ పాటను రచించారు ఆయన . ఆస్ట్రేలియాలోని వులంగాంగ్ లో ఉంటున్న కశ్యప్ సంగీతం సమకూర్చగా అక్కడే ఉంటున్న సంధ్య, నగేష్, రవి, అవంతి గానం చేశారు.
ఈ పాట విని మీ మిత్రులకి షేర్ చేయండి. మరిన్ని తెలుగు విషయాలకోసం మా చానల్ కు సబ్ స్క్రైబ్ చేయండి.